అరకు కాఫీ అద్భుతంగా ఉందండీ: చంద్రబాబు ట్వీట్ కు భువనేశ్వరి రిప్లయ్
- ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
- అరకు నియోజకవర్గంలో పర్యటన
- అరకు కాఫీ రుచి చూసిన వైనం
- అరకు కాఫీ ఎలా ఉందంటూ అర్ధాంగిని అడిగిన చంద్రబాబు
- దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నానండీ అంటూ బదులిచ్చిన భువనేశ్వరి
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి యాత్ర సందర్భంగా అరకు వెళ్లిన నారా భువనేశ్వరి అక్కడి గిరిజన కాఫీని రుచి చూశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు... "భువనేశ్వరీ, అరకు కాఫీ ఎలా ఉంది?" అని సరదాగా అడిగారు.
అందుకు నారా భువనేశ్వరి స్పందిస్తూ... "అరకు కాఫీ అద్భుతంగా ఉందండీ... దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను" అని బదులిచ్చారు. "మనింట్లో అరకు కాఫీ ప్యాకెట్లు చాలా ఉన్నప్పటికీ... ఇక్కడి ప్రకృతి రమణీయత మధ్య, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాల మధ్య అరకు కాఫీ రుచి మరింత బాగుంది" అని కొనియాడారు.
"మన అరకు గిరిజన సోదర సోదరీమణులు ఈ కాఫీని ఎంతో ప్రేమతో సాగు చేయడమే దీని రుచి వెనుక ఉన్న రహస్యం అనుకుంటా" అని నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండ్ గా మలచడంలో మీరు చేసిన కృషి పట్ల గర్విస్తున్నాను అని తెలిపారు.