ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మను అధిగమించిన యశస్వి జైస్వాల్
- ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో చెలరేగుతున్న జైస్వాల్
- నాలుగు టెస్టుల్లో 655 పరుగులు చేసిన యువ కెరటం
- ర్యాంకింగ్స్ లో 12వ స్థానానికి చేరుకున్న జైస్వాల్
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో జైస్వాల్ 12వ స్థానానికి చేరుకున్నాడు. 12వ ర్యాంక్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్ 8 ఇన్నింగ్స్ లలో 93.57 సగటుతో జైస్వాల్ 655 పరుగులు చేశాడు. రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జో రూట్ మరో రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో కేన్ విలియమ్స్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ సిరీస్ కు దూరంగా ఉండటం విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపింది. కోహ్లీ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.