ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీలను అమలు చేస్తున్నాం: మల్లు భట్టి విక్రమార్క

  • బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందన్న మల్లు భట్టి
  • దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన 
  • పెరిగిన ధరల నుంచి ఊరట ఇచ్చేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించినట్లు వెల్లడి
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము చెప్పిన హామీలను అమలు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల ప్రారంభం సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ... బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

మన దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెరిగిన ధరల నుంచి సామాన్యులకు, మహిళలకు ఊరట ఇచ్చేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించినట్లు తెలిపారు. రూ.500కే సిలిండర్ ద్వారా రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.


More Telugu News