ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అనామికను కాల్చిచంపిన భర్త.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
- రాజస్థాన్‌లోని ఫలోడీలో ఘటన
- సీసీటీవీలో రికార్డయిన దారుణ ఘటన
- భార్యపై తుపాకి ఎక్కుపెట్టడానికి ముందు భార్యతో గొడవ
- తుపాకి జామ్ కావడంతో మరో రౌండ్ కాల్చేందుకు చేసే ప్రయత్నం విఫలం
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సెర్ అయిన భార్య అనామికా బిష్ణోయిని భర్త తుపాకితో కాల్చి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని ఫలోడీలో జరిగిందీ ఘటన. గదిలో కూర్చున్న భార్యను అతి సమీపం నుంచి తుపాకితో కాల్చడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తూటా దూసుకెళ్లడంతో బాధతో మెడపట్టుకున్న ఆమె అలాగే కుర్చీలో వాలిపోయింది.
భర్త చేతిలో హతమవడానికి ముందు ఆమె తన ఫాలోవర్లతో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడింది. ఆమె చివరి వీడియో అదే. సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన అనామికా కొంతకాలంగా భర్త నుంచి వేరుగా ఉంటున్నట్టు తెలిసింది. నిందితుడైన ఆమె భర్త పేరు మహీరామ్‌గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఈ హత్య జరిగి ఉంటుందని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
తుపాకితో భార్యను కాల్చడానికి ముందు మహీరామ్ ఆమెతో గొడవ పడినట్టు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. గొడవ ముదరడంతో జేబులోంచి తుపాకి తీసిన నిందితుడు ఆమె తలపై కాల్చాడు. ఒక రౌండ్ కాల్చిన తర్వాత తుపాకి జామ్ కావడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో తుపాకిని రీలోడ్ చేసి మరోసారి కాల్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హత్య ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. భార్యాభర్తల మధ్య కట్నం కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని, హత్యకు ఇదే కారణమని పోలీసులు భావిస్తున్నారు.