రోజా ఓ ఐటెం రాణి.. చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావు: బండ్ల గణేశ్
- రేవంత్ ను జాక్ పాట్ సీఎం అన్న రోజాపై బండ్ల గణేశ్ ఫైర్
- రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని కితాబు
- కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని ఎద్దేవా
ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మరోసారి మండిపడ్డారు. రోజా ఒక ఐటెమ్ రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో... ఆమెకు బండ్ల గణేశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని... ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని... రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని చెప్పారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని... పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని... వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్న కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడిపోతున్నారని చెప్పారు. కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని అన్నారు.