వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. సీబీఐ కోర్టుకు హాజరైన కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి

  • వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాశ్‌రెడ్డి
  • ఇతర నిందితులైన గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు కూడా కోర్టుకు హాజరు
  • తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసిన కోర్టు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానం నేడు మరోమారు విచారణ జరిపింది. కేసు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయనతోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. వాదనల అనంతరం కోర్టు మార్చి 12కు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

కాగా, వివేకా హత్యకేసులో కడప ఎంపీ అయిన అవినాశ్‌రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన విషయం తెలిసిందే. 


More Telugu News