పవన్ కల్యాణ్ కు క్యాష్ ట్రాన్స్ ఫర్ అవుతుంది కానీ...: అంబటి రాంబాబు సెటైర్
- వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన
- రేపు తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగసభ
- చంద్రబాబుకు జనసేన ఓటు ట్రాన్స్ ఫర్ కాదన్న అంబటి
రానున్న ఎన్నికల్లో టీడీపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో కూడా క్లారిటీ వచ్చింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారు. తొలి జాబితాలో రెండు పార్టీలు కలిసి 99 మంది అభ్యర్థులను కూడా ప్రకటించాయి. రెండు పార్టీలు కూడా కలిసి కట్టుగా ప్రచార రంగంలోకి దిగాయి. టీడీపీ నుంచి జనసేనకు, జనసేన నుంచి టీడీపీకి ఓట్ల ట్రాన్స్ ఫర్ కూడా పక్కాగా జరుగుతుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ధీమా వ్యక్తం చేశారు. రేపు తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన పార్టీలు భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నాయి. ఈ సభకు 'జెండా' అని నామకరణం చేశారు.
మరోవైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ కి క్యాష్ ట్రాన్స్ ఫర్ అవుతుంది కానీ... చంద్రబాబుకు మాత్రం ఓటు ట్రాన్స్ ఫర్ కాదని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ కి క్యాష్ ట్రాన్స్ ఫర్ అవుతుంది కానీ... చంద్రబాబుకు మాత్రం ఓటు ట్రాన్స్ ఫర్ కాదని ఎద్దేవా చేశారు.