ఎన్నికలకు సమాయత్తం.. 175 నియోజకవర్గాల నేతలతో జగన్ కీలక సమావేశం
- మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో జగన్
- రేపు మంగళగిరిలో భారీ సమావేశం
- వైనాట్ 175 లక్ష్యంగా మార్గనిర్దేశం చేయనున్న జగన్
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు, మరోసగా రెండో సారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులను మార్చారు. గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయిస్తున్నారు. మరోవైపు, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.
ఈ నెల 27న మంగళగిరిలోని సీకే కన్వెషన్ లో ఈ సమావేశం జరగనుంది. 175 అసెంబ్లీ స్థానాలకు చెందిన నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాదాపు 2 వేల మంది నేతలు సమావేశంలో పాల్గొంటారు. వైనాట్ 175 లక్ష్యంగా ఈ సమావేశంలో నేతలకు జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలి, ప్రత్యర్థుల విమర్శలను ఎలా తిప్పి కొట్టాలి? అనే దానిపై నేతలకు వివరించనున్నారు. మరోవైపు ఈరోజు కుప్పంలో జగన్ సిద్ధం సభ జరగనుంది.