'హెల్త్ ఆన్ అజ్' యాప్ ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • హైదరాబాదులో హెల్త్ యాప్ ప్రారంభోత్సవం
  • హాజరైన పవన్ కల్యాణ్
  • ఇది ప్రజలకు ఉపయోగపడే యాప్ అని కితాబు
జనసేనాని పవన్ కల్యాణ్ ఓ హెల్త్ యాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో 'హెల్త్ ఆన్ అజ్' (Health On Us) అనే యాప్ ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'హెల్త్ ఆన్ అజ్' అనే యాప్ వెనుక ఎంతో కృషి ఉందని, ఇలాంటి యాప్ లతో అనేకమందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఈ యాప్ ఇంటివద్దకే వైద్య సేవలు, ఇంటివద్దకే డాక్టర్లు వంటి సేవలు అందిస్తుందని తెలిపారు. కొన్నిసార్లు ఆసుపత్రులు రద్దీగా ఉంటున్న పరిస్థితులు చూస్తున్నామని, ఆసుపత్రిలో  బెడ్ కావాలంటే మంత్రి రికమండేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు.

సమాజంలో అందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటానని, 'హెల్త్ ఆన్ అజ్' ఆ దిశగా ఉపయోగపడే యాప్ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కరోనా తర్వాత వైద్యరంగం కొత్త పరిస్థితుల్లోకి అడుగుపెడుతోందని అన్నారు.


More Telugu News