అతడ్ని చూస్తుంటే మరో ధోనీలా అనిపిస్తున్నాడు: గవాస్కర్
- రాంచీ టెస్టులో 90 పరుగులు చేసిన టీమిండియా వికెట్ కీపర్ జురెల్
- ధోనీలా పరిస్థితులకు తగ్గట్టు ఆడాడన్న గవాస్కర్
- ఇదే ఆటతీరు కనబరిస్తే ఎన్నో సెంచరీలు సాధిస్తాడని వ్యాఖ్యలు
రాంచీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ 90 పరుగులతో చక్కని బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. టాపార్డార్ విఫలమైన చోట ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడి టీమిండియా ఇన్నింగ్స్ ను నడిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ధ్రువ్ జురెల్ ఆడిన తీరు ఎంతో సమయోచితంగా ఉందని, పరిస్థితులకు తగ్గట్టుగా బుర్ర ఉపయోగించి ఆడాడని కితాబిచ్చారు. జురెల్ ను చూస్తుంటే మరో ధోనీ తయారవుతున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. ఇవాళ రాంచీలో ఆడినట్టే ఆడితే మున్ముందు జురెల్ ఎన్నో సెంచరీలు సాధిస్తాడని, అతడికి పరిస్థితులను అర్థం చేసుకుని చేసుకుని ఆడడం ఎలాగో తెలుసని కితాబిచ్చారు.
23 ఏళ్ల జురెల్ కు ఇది రెండో టెస్టు మాత్రమే. రాజ్ కోట్ టెస్టుతో ఆరంగేట్రం చేసిన ఈ యువ వికెట్ కీపర్ టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడని ఇతర మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు.