సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు... వీడియో ఇదిగో!

  • ద్వారక వద్ద మోదీ స్కూబా డైవింగ్
  • ఆక్సిజన్ మాస్కు సాయంతో సముద్రం అడుగునకు చేరుకున్న మోదీ
  • పవిత్రభూమిని చూసి ముగ్ధులైన వైనం 
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అరేబియా సముద్ర తీరంలో నీట మునిగిన ద్వారక నగరాన్ని సందర్శించారు. ఆయన ఆక్సిజన్ మాస్కు సాయంతో సముద్రం అడుగుభాగానికి చేరుకున్నారు. 

అక్కడి పుణ్యభూమికి భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు. తనతోపాటు తీసుకెళ్లిన నెమలి పింఛాలను వింజామరలా వీచారు. అనంతరం ఆ పింఛాలను అక్కడే ప్రతిష్ఠించారు. పద్మాసనం వేసుకుని శ్రీకృష్ణ భగవానుడ్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు నడయాడినట్టుగా భావిస్తున్న ఆ దివ్య నగరాన్ని చూసి మోదీ ముగ్ధులయ్యారు. 

మహాభారత కాలం నాటి ద్వారక నగరం... శ్రీకృష్ణుడి అవతార ప్రయోజనం సిద్ధించగానే సముద్ర జలాల్లో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. పరిశోధకులు నీట మునిగిన ద్వారక నగరాన్ని కనుగొనడంతో మహాభారతం నిజంగానే జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతోంది. 


More Telugu News