రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఇంగ్లండ్... టీమిండియా టార్గెట్ 192

  • నాలుగో టెస్టులో గెలుపు దిశగా టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
  • లక్ష్యఛేదనలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసిన టీమిండియా
  • రాంచీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట
రాంచీ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ 5, కుల్దీప్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పనిబట్టారు. జడేజాకు 1 వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 60, బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. 

అనంతరం, 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 152 పరుగులు చేయాలి. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా... టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది.


More Telugu News