నీట మునిగిన ద్వారకా నగరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

  • ద్వారక వద్ద అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని సముద్రంలోకి దిగిన వైనం
  • ద్వారకాధీశ్ ఆలయంలో పూజలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్ లోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ 'సుదర్శన సేతు'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు, నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించేందుకు ప్రధాని మోదీ ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని సముద్ర జలాల్లోకి దిగారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. 

"అగాధ జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు  జరిపేందుకు వెళ్లడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. ప్రాచీన కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తిభావానికి నేను అనుసంధానించబడ్డానన్న భావన కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించుగాక" అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు తన పర్యటన ఫొటోలను కూడా పంచుకున్నారు.


More Telugu News