కారు మారి ప్రాణాలతో బయటపడిన బాలిక శ్లోక.. లాస్య నందిత కారు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం
- రెడీమిక్స్ వాహనం కానీ, టిప్పర్ కానీ ఢీకొట్టి ఉంటుందని అనుమానం
- ఎమ్మెల్యే కారుపై రాక్‌శాండ్ పడి ఉండడంతో పోలీసుల అనుమానం
- ఎమ్మెల్యే పీఏ రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన పోలీసులు
- ఆయన సెల్‌ఫోన్ డేటా విశ్లేషణ
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారుపై రాక్‌శాండ్ పౌడర్ కనిపించడంతో టిప్పర్ కానీ, రెడీమిక్స్ వాహనం కానీ ఢీకొట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఓఆర్ఆర్‌పై ఆరు టిప్పర్లు వెళ్లినట్టు కూడా గుర్తించారు. మరోవైపు, కారు నడిపిన ఎమ్మెల్యే పీఏ ఆకాశ్ మద్యం తాగి ఉన్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఆయన సెల్‌ఫోన్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.
కారు మారడంతో బతికిపోయిన బాలిక
ఎమ్మెల్యే లాస్యనందిత తరచూ అనారోగ్యం పాలవుతుండడం, రెండు రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు, బంధువుల సూచనతో ఈ నెల 22న రాత్రి సదాశివపేట మండలం ఆరూర్‌లోని మిస్కిన్‌పాషా దర్గాకు వెళ్లి పూజలు చేయించుకున్నారు. అనంతరం తెల్లవారుజామున తిరిగి ఇంటికి బయలుదేరారు. ఒక కారులో ఎమ్మెల్యే, ఆకాశ్‌తోపాటు చిన్నారి శ్లోక ఉండగా, మరో కారులో ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే, శ్లోక పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో త్వరగా పంపేందుకు కుటుంబ సభ్యులున్న కారులోకి మార్చారు. తాను టిఫిన్ చేసి వస్తానని, మీరు వెళ్లాలని వారిని పంపించారు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం జరిగి లాస్య ప్రాణాలు కోల్పోయారు.