ముగిసిన మేడారం మహా జాతర... వన ప్రవేశం చేసిన సమ్మక్క, సారలమ్మ

  • ఫిబ్రవరి 21న ప్రారంభమైన మేడారం జాతర
  • నాలుగు రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో అతిపెద్ద గిరిజన పండుగ
  • అమ్మవార్లను సందర్శించుకున్న 1.40 కోట్ల మంది భక్తులు
రెండేళ్లకోసారి వచ్చే మేడారం మహా జాతర నేటితో ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి జరుగుతున్న ఈ జాతర సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో పూర్తయింది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద  గిరిజన పండుగగా మేడారం జాతర గుర్తింపు పొందింది. ఈ నాలుగు రోజుల్లో అమ్మవార్లను 1.40 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్టు భావిస్తున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు మరింతగా పోటెత్తారు. అమ్మవార్ల గద్దెల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. కాగా... సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలను గద్దెలపై ఉంచి ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.


More Telugu News