జీవో నెం.317పై మంత్రి రాజనర్సింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ
- 2016లో తెలంగాణలో కొత్త జిల్లాలు
- కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్త జోన్ల ఏర్పాటు
- 2021లో జీవో నెం.317 తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- ఉద్యోగుల సర్దుబాటు కోసం జీవో... తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగులు
- ఉద్యోగుల అభ్యంతరాలపై దృష్టి సారించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలో 2016లో అప్పటి ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలతో పాటే కొత్త జోన్లు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, కొత్త జిల్లాలు, కొత్త జోన్లకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం 2021లో జీవో నెం.317 తీసుకువచ్చారు.
ఆ సమయంలో ఉద్యోగులు జీవోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోయే విధంగా జీవో నెం.317 ఉందని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. నాడు, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఉద్యోగులకు మద్దతు పలికి పోరుబాట పట్టింది.
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో... సీఎం రేవంత్ రెడ్డి జీవో నెం.317పై దృష్టి సారించారు. ఉద్యోగుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
మంత్రి రాజనర్సింహ ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇందులో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. ఈ జీవోలో పేర్కొన్న అంశాలు, ఉద్యోగుల అభ్యంతరాలు, వివాదాలను ఈ సబ్ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులతో కూడిన నివేదిక అందించనుంది.