తెలంగాణకు వర్ష సూచన... వివరాలు ఇవిగో!
- మరాట్వాడా నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం
- అనుబంధంగా ఉపరితల ద్రోణి
- నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
మరాట్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు వర్షాలు పడతాయని తెలిపింది.
ఫిబ్రవరి 24న కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఫిబ్రవరి 25న ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది.
ఫిబ్రవరి 26న ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలంగాణ విభాగం వెల్లడించింది.