మైండ్ బ్లోయింగ్ లాజిక్... పవన్ వ్యాఖ్యలపై వర్మ స్పందన

  • తొలి జాబితా ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి
  • జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాల కేటాయింపు
  • మొత్తమ్మీద 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క అని పవన్ వివరణ
  • రెండు లక్షల పుస్తకాల సారం పిండి ఈ లాజిక్ వెలువరించారన్న వర్మ
టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో, వివిధ రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలు కేటాయించగా... 24 సీట్లేనా అనుకోవద్దని, 3 లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో మనం పోటీ చేస్తున్నట్టేనని పవన్ వివరణ ఇచ్చారు. 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. "మైండ్ బ్లోయింగ్ లాజిక్" అంటూ ట్వీట్ చేశారు. రెండు లక్షల పుస్తకాల సారం పిండి మతిపోయే లాజిక్ ను వెలువరించారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మరో ట్వీట్ లో... "23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు, 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు... అందుకే మధ్యే మార్గంగా 24" అంటూ తనదైన శైలిలో విశ్లేషించారు.


More Telugu News