టీడీపీ-జనసేన లిస్టులో విద్యావంతులకు, మహిళలకు ప్రాధాన్యం

  • తొలి జాబితా ప్రకటించిన టీడీపీ, జనసేన
  • 94 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
  • 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేన
  • ఉమ్మడి జాబితాలో 63 మంది గ్రాడ్యుయేట్లు, 30 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు
  • ఒక ఐఏఎస్, ముగ్గురు ఎంబీబీఎస్ లకు స్థానం
టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ రెండు పార్టీలు నేడు తొలి జాబితా ప్రకటించాయి. టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుండగా...  5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 

టీడీపీ, జనసేన తమ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో విద్యావంతులకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయి. రెండు పార్టీలు కలిపి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.... అందులో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ముగ్గురు ఎంబీబీఎస్ లు, ఇద్దరు పీహెచ్ డీ స్కాలర్లు, ఒక ఐఏఎస్ కూడా ఉన్నారు. 

ఓవరాల్ గా 86 మంది పురుష అభ్యర్థులు కాగా... 13 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. మొత్తం 99 మంది అభ్యర్థుల్లో 25 నుంచి 35 ఏళ్ల వయస్కులు ఇద్దరు... 36 నుంచి 45 ఏళ్ల వయస్కులు 22 మంది... 46 నుంచి 60 ఏళ్ల వయస్కులు 55 మంది... 61 నుంచి 75 ఏళ్ల వయస్కులు 20 మంది ఉన్నారు.


More Telugu News