గుండెపోటుతో మైదానంలో కన్నుమూసిన కర్ణాటక మాజీ క్రికెటర్
- తీవ్రమైన ఛాతినొప్పితో మైదానంలో కుప్పకూలిన కర్ణాటక మాజీ ఆటగాడు హోయసల
- హాస్పిటల్‌కు తరలిస్తుండగా గుండెపోటుతో మార్గమధ్యంలోనే మృతి
- ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్’లో తమిళనాడు, కర్ణాటక మధ్య మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న విషాదం
క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ క్రికెటర్ కే.హోయసల గుండెపోటుతో కన్నుమూశాడు. కేవలం 34 ఏళ్ల వయసులోనే అతడు మైదానంలోనే కుప్పకులాడు. ‘ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్’లో భాగంగా బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఐ క్రికెట్ మైదానంలో తమిళనాడు, కర్ణాటక మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన కర్ణాటక ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగిన సమయంలో తీవ్రమైన ఛాతినొప్పితో మైదానంలోనే హోయసల కుప్పకూలాడు.
గమనించిన తోటి ఆటగాళ్లు, సిబ్బంది అంబులెన్స్ ద్వారా హుటాహుటిన సమీపంలో ఉన్న బౌరింగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తీవ్ర గుండెపోటుకు గురై హోయసల మరణించాడని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ విషాద ఘటన ఫిబ్రవరి 22న జరగగా తాజాగా వెల్లడించారు. హోయసల మృతిని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. చాలావరకు గుండెపోటు కారణంగానే హోయసల ప్రాణాలు కోల్పోయాడని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని బౌరింగ్ హాస్పిటల్, అటల్ బిహారీ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ మనోజ్ కుమార్ అన్నారు. కాగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, బౌలర్‌గా అండర్-25 విభాగంలో కర్ణాటక జట్టుకు హోయసల ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు.