అవినీతి కేసులో తమిళ టీవీ నటికి బెయిల్
- స్నేహం ఫౌండేషన్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు నటి జయలక్ష్మిపై కేసు
- ఫౌండేషన్ వ్యవస్థాపకుడి ఫిర్యాదుతో గత నెలలో నటి అరెస్టు
- బెయిల్ కోసం పిటిషన్, శుక్రవారం విడుదల
తమిళనాడులో స్నేహం ఫౌండేషన్‌కు సంబంధించి అవినీతి కేసులో అరెస్టయిన నటి జయలక్ష్మి తాజాగా బెయిల్‌పై విడుదలయ్యారు. గత నెల 20న చెన్నై అన్నానగర్‌లో పోలీసులు ఆమెను అరెస్టు చేయగా శుక్రవారం బెయిల్‌పై బయటకొచ్చారు.
నటుడు స్నేహన్ మక్కళ్ నీది మయ్యం ‘స్నేహం ఫౌండేషన్’ పేరిట ట్రస్టు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్టు పేరిట లక్షలాది రూపాయల విరాళాలు సేకరించి నటి జయలక్ష్మి మోసానికి పాల్పడ్డట్టు స్నేహన్ 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుమంగళం పోలీసులు ఆమెను గతనెలలో అరెస్టు చేసి పుళల్ జైల్లో వేశారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం విడుదలయ్యారు.