మా సినిమాకు పిల్లలు రావొద్దు.. ‘తంత్ర’ నుంచి వెరైటీ వార్నింగ్
- అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి జంటగా ‘తంత్ర’
- సినిమాకు సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్
- క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీని ఎంచుకున్న టీం
- ‘ఎ’ని హైలైట్ చేస్తూ మూవీ పోస్టర్లు
తమ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ రావడంపై ‘తంత్ర’ మూవీ టీం వినూత్నంగా స్పందించింది. ఈ సినిమాకు పిల్లలు రావొద్దని హెచ్చరిస్తూ ‘ఎ’ని హైలైట్ చేస్తూ పోస్టర్‌ను ముద్రించింది. మంచి హారర్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ ఈ సినిమాకు చిన్నపిల్లలు రాకుండా పోస్టర్ ముద్రణ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి దీనిని కూడా క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీగా చెప్పొచ్చు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు యూత్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకు గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల ఒదిగిపోయింది. ‘ధీరే ధీరే’ సాంగ్‌లో కుర్రకారు మనసుల్ని మెలిపెట్టేసింది. అనన్యకు జోడీగా శ్రీహరి కుటుంబం నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే, మర్యాద రామన్న ఫేం సలోనీ, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని తదితరులు ఈ హార్డ్ హిట్టింగ్ హారర్ డ్రామాకి మరింత డోస్ పెంచినట్టు దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి చెప్పాడు.ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నట్టు నిర్మాతలు నరేశ్‌బాబు, రవిచైతన్య ప్రకటించారు. మార్చి 15న సినిమాను విడుదల చేయనున్నారు.