ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా?.. కీలక ప్రకటన చేసిన గూగుల్
- సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన గూగుల్
- జీమెయిల్ సర్వీసు నిలిచిపోదని స్పష్టం చేసిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం
- గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేల్చిన సంస్థ
వచ్చే ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా? ఈ ఏడాది చివరి నాటికల్లా జీమెయిల్ పూర్తిగా కనుమరుగవనుందా?.. సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులు జరుగుతున్న ప్రచారం కారణంగా జీమెయిల్ యూజర్లలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ స్క్రీన్‌షాట్ యూజర్లను ఆందోళనలకు గురిచేస్తోంది. ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసుకు ముగింపు అంటూ సదరు స్క్రీన్ షాట్ పేర్కొంది. ఆగస్టు తర్వాత ఈ-మెయిల్స్‌ను పంపించడం, స్వీకరించడం సాధ్యపడదని, స్టోర్ చేసుకోవడం కూడా వీలుకాదని ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. ఈ స్క్రీన్ షాట్ కొన్ని వేల సంఖ్యలో షేర్ అయ్యింది. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
జీమెయిల్ సర్వీస్‌ను నిలిపివేయబోమని గూగుల్ తేల్చిచెప్పింది. ‘జీమెయిల్ ఉండటానికే ఉంది’ అంటూ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న ఊహాగానాలకు తెరపడింది. గూగుల్‌తో పాటు కొందరు టెక్ నిపుణులు కూడా సోషల్ మీడియా యూజర్లకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గూగుల్ ఈ ఏడాది హెచ్‌టీఎంఎల్ జీమెయిల్ వెర్షన్‌ను నిలిపివేస్తోందని, ఈ-మెయిల్ సర్వీస్ నిలిచిపోవడంలేదని పేర్కొన్నారు. జనవరి 2024 నాటికి జీమెయిల్ హెచ్‌టీఎంఎల్ వెర్షన్‌ను మాత్రమే నిలిపివేసిందని, ప్రామాణిక జీమెయిల్ సర్వీస్ ఎప్పటిలాగానే చక్కగా పని చేస్తుందని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ఉత్త ప్రచారమేనని టెక్ నిపుణులు మార్షా కొల్లియర్ తెలిపారు. జీమెయిల్ హెచ్‌టీఎంఎల్‌లో తీసుకొస్తున్న మార్పులతో నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా జీమెయిల్ సర్వీసులు పొందడానికి అవకాశమిస్తుందని వివరించారు.
కాగా జీమెయిల్ సర్వీస్ నిలిచిపోనుందంటూ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్, టిక్‌టాక్ వేదికలుగా పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం జరిగింది. ఫేక్ స్క్రీన్‌షాట్ కొన్ని షేర్లు అయ్యిందంటే ప్రచారం ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ ఇమేజ్ టూట్ ‘జెమినీ’ విషయంలో ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటున్న గూగుల్‌కు జీమెయిల్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగలనుందని ఫేక్ స్క్రీన్‌షాట్ సృష్టికర్తలు పేర్కొన్నారు. దీంతో చాలా మంది నమ్మారు. కానీ ఇదంతా ఉత్తిత్తి ప్రచారమని నిర్ధారణ అయ్యింది.