ఫిబ్రవరి 27 నుంచి మరో రెండు హామీల అమలు: సీఎం రేవంత్ రెడ్డి

  • ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
  • ఇప్పటికే కొన్ని గ్యారెంటీల అమలు
  • ఫిబ్రవరి 27న రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీల అమలు
ఈ మధ్యాహ్నం మేడారం జాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 

ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ హామీల అమలుకు తామందరం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27 సాయంత్రం మరో రెండు హామీల అమలుకు శ్రీకారం చుట్టనున్నామని... 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా హాజరవుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఇక, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై శుభవార్త వింటారని పేర్కొన్నారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని వివరించారు.


More Telugu News