ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
- 15 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 4 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప నష్టాల్లో ముగించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు... ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 73,142కి చేరింది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 22,212 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (1.43), మహీంద్రా అండ్ మహీంద్రా (1.13), టైటాన్ (1.08), విప్రో (0.90), రిలయన్స్ (0.78).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42), మారుతి (1.32), ఏసియన్ పెయింట్స్ (1.21), భారతి ఎయిర్ టెల్ (1.11), టీసీఎస్ (0.96).