ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టు వివరాలు ఇవిగో!
- కొన్నిరోజుల కిందటే ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన లాస్య నందిత
- నేడు అవుటర్ రింగ్ రోడ్డుపై దుర్మరణం
- గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం
- నుజ్జునుజ్జయిన ఎముకలు... తలకు బలమైన దెబ్బలు
- సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచిన ఎమ్మెల్యే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితను విధి వెంటాడడం తెలిసిందే. కొన్ని రోజుల కిందటే ఓ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె, ఈసారి తప్పించుకోలేకపోయారు. ఈ ఉదయం అవుటర్ రింగ్ రోడ్డుపై సుల్తాన్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు విడిచారు.
లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. ఆమె శరీరం నుజ్జు నుజ్జయిపోయిందని పోస్టుమార్టం నిర్వహించిన వైద్య నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ప్రాణాంతకంగా పరిణమించిందని తెలిపారు. ఎమ్మెల్యే లాస్య నందిత ఘటన స్థలిలోనే మరణించారని, తలకు బలమైన దెబ్బలు తగలడంతో ఆమె ప్రాణాలు విడిచారని తెలిపారు. ఒక కాలు విరిగిపోయింది... శరీరంలోని ఎముకలు విరిగిపోయాయి... ముఖ్యంగా తొడ ఎముక, పక్కటెముకలు విరిగిపోయాయి... 6 దంతాలు ఊడిపోయాయి అని నివేదికలో వివరించారు.