ఒకే ఎన్ క్లోజర్ లో అక్బర్, సీత అనే సింహాలు... పేర్లు మార్చాలంటూ హైకోర్టు బెంచ్ ఆదేశాలు
- త్రిపుర నుంచి బెంగాల్ కు రెండు సింహాలు
- మగ సింహం పేరు అక్బర్, ఆడ సింహం పేరు సీత
- తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్
- ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అంటూ హైకోర్టులో పిటిషన్
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి సఫారీ పార్క్ లో అక్బర్, సీత అనే సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడం పట్ల విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అంటూ కలకత్తా హైకోర్టు జల్పాయ్ గురి బెంచ్ ను ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అధికారులే ఆ సింహాలకు పేర్లు పెట్టారని ఆరోపించింది. వీహెచ్ పీ పిటిషన్ పై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు జల్పాయ్ గురి బెంచ్... ఆ రెండు సింహాలకు పేర్లు మార్చాలని ఆదేశించింది. తద్వారా ఈ వివాదానికి తెరదించాలని జస్టిస్ సౌగతా భట్టాచార్య స్పష్టం చేశారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆ సింహాలను త్రిపుర నుంచి తీసుకువచ్చారని, వాటికి త్రిపురలోనే పేర్లు పెట్టారని వివరించారు. పేర్లను మార్చే అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తోందని వెల్లడించారు.
కాగా, పశ్చిమ బెంగాల్ అధికారులు ఈ రెండు సింహాలను త్రిపురలోని సిపాహీజాలా జూలాజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చారు. ఇందులో అక్బర్ మగ సింహం కాగా, సీత ఆడసింహం.