తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ నేతపై త్రిష పరువునష్టం దావా
- త్రిషపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏవీ రాజు
- ఎమ్మెల్యే వెంకటాచలం రూ.25 లక్షలిచ్చి త్రిషను రిసార్ట్ కు పిలిపించుకున్నారని వ్యాఖ్యలు
- ఇలాంటి వారిని వదిలేది లేదన్న త్రిష
అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు నటి త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. జయలలిత మరణం తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వెళ్లకుండా వారిని ఓ బీచ్ రిసార్టుకు తరలించారని, ఆ సమయంలో ఎమ్మెల్యే జి.వెంకటాచలం రూ.25 లక్షలు ఇచ్చి త్రిషను రిసార్ట్ కు పిలిపించుకున్నారని ఏవీ రాజు ఓ వీడియోలో పేర్కొన్నాడు.
దీనిపై తీవ్రంగా మండిపడుతున్న త్రిష... పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారే వ్యక్తులను పదే పదే చూడాల్సి రావడం అసహ్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి వారిని వదిలేది లేదని, అతని వ్యాఖ్యలకు తన జవాబు న్యాయ విభాగం నుంచి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సదరు నేతపై పరువు నష్టం దావా వేశారు. భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపారు.