కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ పై అడిగితే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సమాధానం ఇదే...!
- ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్
- నాలుగో టెస్టుకు జట్టులోకి వస్తాడంటూ ప్రచారం
- కొట్టిపారేసిన బీసీసీఐ
- కేఎల్ రాహుల్ అన్ ఫిట్ అంటూ వెల్లడించిన విక్రమ్ రాథోడ్
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కు గాయాలు పరిపాటిగా మారాయి. గతేడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడి నాలుగు నెలలు క్రికెట్ కు దూరమైన ఈ కర్ణాటక బ్యాటర్... ప్రస్తుతం ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. రేపు (ఫిబ్రవరి 23) ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు రాహుల్ ఫిట్ నెస్ సాధిస్తాడని వార్తలు వచ్చినా, బీసీసీఐ వాటిని తోసిపుచ్చింది. నాలుగో టెస్టులో కేఎల్ రాహుల్ ఆడడంలేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్ మెంట్ కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ పై అప్ డేట్ ఇచ్చింది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందిస్తూ... కేఎల్ రాహుల్ ఇంకా ఫిట్ నెస్ అందుకోలేదని వెల్లడించాడు.
అయితే, మీడియా ప్రతినిధులు ఎంత శాతం మేరకు రాహుల్ కోలుకున్నాడని ప్రశ్నించగా... ఓ ఆటగాడు ఫిట్ గా ఉన్నాడా, లేడా అనేది మాత్రం చెప్పగలం కానీ, ఇలా ఎంత శాతం ఫిట్ గా ఉన్నాడని ఎలా చెబుతామని తిరిగి ప్రశ్నించాడు. ఇలాంటి పర్సెంటేజీలపై తనకు నమ్మకం లేదని విక్రమ్ రాథోడ్ తెలిపాడు.
ఇప్పటివరకు తనకు తెలిసినదాని ప్రకారం కేఎల్ రాహుల్ అన్ ఫిట్ అని స్పష్టం చేశాడు. అయితే, రాహుల్ గాయం గురించి తనకంటే బీసీసీఐ వైద్య బృందం సరైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నాడు.