మేడారంలో కీలక ఘట్టం... చిలకలగుట్ట దిగిన సమ్మక్క
- భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం జాతర
- చిలకలగుట్ట దిగి గద్దెల వద్దకు బయలుదేరిన సమ్మక్క
- వనం వీడి జనంలోకి వచ్చిన సమ్మక్కకు స్వాగతం పలికిన మంత్రి సీతక్క
మేడారం మహా జాతరలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు.
మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్కను ఈ రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోయాయి.