'బోల్డ్ ఈజ్ గోల్డ్' అనుకునే సినిమా ఇది: 'సిద్ధార్థ్ రాయ్' ఈవెంట్లో కోన వెంకట్
- రేపు రిలీజ్ అవుతున్న 'సిద్ధార్థ్ రాయ్'
- హీరోగా పరిచయమవుతున్న దీపక్ రాజ్
- 'అర్జున్ రెడ్డి'కీ ఈ సినిమాకి పోలిక లేదన్న కోన
- డిఫరెంట్ కంటెంట్ తో మెప్పిస్తుందని వెల్లడి
కొంతకాలం క్రితం బాలనటుడిగా ' మిణుగురులు' సినిమాతో పరిచయమైన దీపక్ సరోజ్, ఇప్పుడు హీరోగా 'సిద్ధార్థ్ రాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది.
ఈ వేదికపై కోన వెంకట్ మాట్లాడుతూ .. "ఈ సినిమా చూసిన తరువాత ... నేను ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను అనే ఒక జలసీ నాలో కలిగింది. అలా అనిపించిందంటే అది బ్లాక్ బస్టర్ అని అర్థం. అలాగే దీపక్ ను హీరోగా నేను పరిచయం చేయలేకపోయానే అని కూడా అనిపించింది. దర్శకుడు యశస్వీ ఈ కథను గొప్పగా రాసుకున్నాడు" అని అన్నారు.
" ఈ సినిమాకి 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎలాంటి పోలిక లేదు. ఈ సినిమా కంటూ కొత్త కంటెంట్ ఉంది. అసలు ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. కంటెంట్ తనని తాను ప్రమోట్ చేసుకుంటూ వెళ్లిపోతుంది. థియేటర్స్ కి ఆడియన్స్ ను తీసుకొచ్చేస్తుంది. ఒకప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేవారు .. ఈ సినిమా చూసిన తరువాత 'బోల్డ్ ఈజ్ గోల్డ్' అంటారు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.