ట్రేడింగ్ చివర్లో భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

  • 535 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 162 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ హెచ్సీఎల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల బాట పట్టాయి. అయితే చివరి గంటలో పుంచుకుని భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 535 పాయింట్లు లాభపడి 73,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్లు పెరిగి 22,217 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.12%), ఐటీసీ (2.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.61%), టీసీఎస్ 2.44%), టెక్ మహీంద్రా (2.32%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.28%), కోటక్ బ్యాంక్ (-1.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.73%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.61%).


More Telugu News