రూ. 5 కోట్లతో బాంద్రాలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్
- టీమిండియా టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా మారిన జైస్వాల్
- ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు
- బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో 1100 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ కొనుగోలు
టీమిండియా డైనమిక్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. ఎవరికీ తెలియకుండా పెళ్లెప్పుడు చేసుకున్నాడబ్బా అని పొరపాటుగా భావించొద్దు. ముంబైలోని ఖరీదైన బాంద్రాలో రూ. 5.38 కోట్లు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేసి దానికి యజమాని అయ్యాడు. నిర్మాణంలో ఉన్న టెన్ బీకేసీ ప్రాజెక్ట్‌లో 1100 చదరపు అడుగుల ఫ్లాట్‌ను జైస్వాల్ కొనుగోలు చేసినట్టు ‘మనీ కంట్రోల్’ పేర్కొంది. గత నెల 7న అది బ్యాటర్ పేరున రిజిస్టర్ అయినట్టు తెలిపింది. 22 ఏళ్ల జైస్వాల్ గతేడాది జులైలో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి అద్భుతమైన ప్రదర్శనతో జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో జైస్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 109.00 సగటుతో 545 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.