విమానం ఎక్కుతూ తూలి పడబోయిన బైడెన్.. వీడియో ఇదిగో!

  • బైడెన్ వయసుపై మరోసారి చర్చ
  • వృద్ధాప్యం కారణంగా మతిమరుపుతో బాధపడుతున్న అమెరికా ప్రెసిడెంట్
  • అధ్యక్ష బాధ్యతలకు ఫిట్ కాదంటూ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తి క్షీణించిందని ఇటీవల రిపబ్లికన్ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. విదేశీ నేతల పేర్లతో పాటు తమ పార్టీ నేతల పేర్లనూ ఆయన మరచిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలి సంఘటనలను రిపబ్లికన్లు ఉదాహరిస్తున్నారు. మతిమరపుతో బాధపడుతున్నారనే ఆరోపణలకు తోడు బైడెన్ శారీరక ఆరోగ్యంపైనా రిపబ్లికన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఊతమిచ్చేలా తాజాగా మరో సంఘటన జరిగింది. 

అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ బైడెన్ తూలిపడబోయాడు. మెట్లపై పడిపోయే ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే మరోసారి తూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. విమానం ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు చాలా చిన్నగా ఉంటాయని, అలాంటి మెట్లు ఎక్కడానికీ బైడెన్ తడబడ్డారంటే ఆయన ఫిట్ నెస్ పై అనుమానాలు రావడం సహజమేనని అంటున్నారు.
 
ఈ ఏడాది 82వ వసంతంలోకి అడుగుపెట్టనున్న బైడెన్.. వయసురీత్యా, మెమరీ పవర్ దృష్ట్యా అధ్యక్ష పదవికి అనర్హుడని రిపబ్లికన్ నేతలు ఆరోపిస్తున్నారు. అమెరికన్ పౌరులతో పాటు పలువురు సెనేటర్లు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా విమానం మెట్లు ఎక్కుతూ బైడెన్ తూలిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బైడెన్ వయసుపై, ఆయన ఫిట్ నెస్ పై మరోసారి చర్చ జరుగుతోంది.


More Telugu News