వాట్సప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్త ఆప్షన్లు
- టెక్స్ట్ ఫార్మాటింగ్‌కు కొత్త షార్ట్ కట్‌లను పరిచయం చేసిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్
- డ్యాష్ సింబల్ ఎంటర్ చేసి స్పేస్ ఇస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తోన్న బుల్లెట్ పాయింట్
- గ్రేటర్ దెన్ సింబల్ పక్కన స్పేస్ ఇస్తే హైలెట్ అవుతున్న టెక్స్ట్
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తాజాగా మరికొన్ని ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల ప్రైవసీని మరింత మెరుగుపరుస్తూ కొత్త టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లను రూపొందించింది. వాట్సప్ యూజర్లు తాము పంపించే టెక్స్ట్‌కి బుల్లెట్ పాయింట్లు, బ్లాక్ కోట్‌లు, ఇన్‌లైన్ కోడ్‌ల కోసం షార్ట్ కట్ మార్గాలను ఉపయోగించుకోవచ్చు. ఈ నూతన ఫార్మాటింగ్ ఆప్షన్ల ద్వారా యూజర్లు తమ సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడంతో పాటు మెసేజులను సులభంగా క్రియేట్ చేసుకోవచ్చని వాట్సప్ పేర్కొంది.
ఈ కొత్త ఆప్షన్లు వినియోగదారుల చాటింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరచనున్నాయని వాట్సప్ ఆశాభావం వ్యక్తం చేసింది. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, వాట్సప్ వెబ్ వెర్షన్‌తో పాటు వివిధ ప్లాట్‌ఫారమ్‌లపై ఈ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చునని వెల్లడించింది. టెక్స్ట్ ఫార్మాట్‌లో ఈ కొత్త ఆప్షన్లు మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ఇటీవలే వాట్సప్ ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. నకిలీ సమాచారానికి అట్టుకట్ట వేయడమే లక్ష్యంగా దీనిని పరిచయం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫేక్ వార్తల వ్యాప్తిని అరికట్టడానికి కొత్త హెల్ప్‌లైన్‌ను షురూ చేసింది. సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి ఇది ఉపయోగపడనుందని వెల్లడించింది.
- యూజర్లు తమ మెసేజ్‌కి బుల్లెట్ పాయింట్లు ఇవ్వాలనుకుంటే మెసేజ్‌కు ముందు డ్యాష్ సింబల్ (-) టైప్ చేసి స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా యూజర్ల సందేశానికి బుల్లెట్ పాయింట్ వచ్చేస్తుంది.
- ఇక మెసేజ్‌ని హైలైట్ చేయాలనుకుంటే ‘గ్రేటర్ దెన్’ (>) సింబల్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. టెక్స్ట్‌కు ముందు > సింబల్ టైప్ చేసి స్పేస్ ఇస్తే ఎంచుకున్న టెక్స్ట్ హైలైట్ అవుతుంది.
- మరోవైపు యూజర్లు ఇకపై బ్యాక్‌టిక్‌లతో (`) తమ సందేశాన్ని ఇన్‌లైన్ కోడ్‌గా ఫార్మాట్ చేయవచ్చని వివరించింది.