ఈ ఐదు ఆండ్రాయిడ్ ఆప్ లతో జాగ్రత్త అంటున్న నిపుణులు

  • విజృంభిస్తున్న అనాట్సా మాల్వేర్
  • ఆర్థిక వ్యవహారాల సమాచారం తస్కరించడమే టార్గెట్
  • ఆండ్రాయిడ్ 13, అంతకుముందు వెర్షన్లకు ముప్పు
ఇప్పుడు సైబర్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనాట్సా మాల్వేర్. ఇది ఆండ్రాయిడ్ యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడుతుంది. కంప్యూటర్లపైనా ఇది పంజా విసురుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

ఫోన్లు, కంప్యూటర్లలోని ఆర్థికపరమైన వ్యవహారాల సమాచారాన్ని దొంగిలించడమే ఈ మాల్వేర్ పని. ప్రధానంగా అనాట్సా మాల్వేర్ ఐదు ఆండ్రాయిడ్ యాప్ ల ద్వారా డివైస్ లలోకి ప్రవేశిస్తున్నట్టు థ్రెట్ ఫ్యాబ్రిక్ సంస్థకు చెందిన సైబర్ పరిశోధకులు గుర్తించారు. ఈ ఐదు యాప్ లలో ఏ ఒక్కటి మీ ఫోన్లలో ఉన్నా, దాన్ని వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నారు. 

గత నవంబరు నుంచి అనాట్సా మాల్వేర్ ఉనికి ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఇది ఫోన్లలోని సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఏమార్చుతుంది. 

గూగుల్ ఇప్పటికే అనాట్సా మాల్వేర్ ను కలిగివున్న ఐదు యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. ఈ మాల్వేర్ తో ఆండ్రాయిడ్-13, అంతకుముందు వెర్షన్లు ఉండే ఫోన్లకు ముప్పు ఎక్కువని నిపుణులు పేర్కొన్నారు.

1. ఫోన్ క్లీనర్-ఫైల్ ఎక్స్ ప్లోరర్ 
Phone Cleaner - File Explorer (com.volabs.androidcleaner)
2. పీడీఎఫ్ వ్యూయర్-ఫైల్ ఎక్స్ ప్లోరర్ 
PDF Reader - File Explorer (com.xolab.fileexplorer)
3. పీడీఎఫ్ రీడర్-వ్యూయర్ అండ్ ఎడిటర్ 
PDF Reader - Viewer & Editor (com.jumbodub.fileexplorerpdfviewer)
4. ఫోన్ క్లీనర్: ఫైల్ ఎక్స్ ప్లోరర్
Phone Cleaner: File Explorer (com.appiclouds.phonecleaner)
5. పీడీఎఫ్ రీడర్: ఫైల్ మేనేజర్
PDF Reader: File Manager (com.tragisoap.fileandpdfmanager)


More Telugu News