నేపాల్‌ను హిందూ రాజ్యంగా ప్రకటించాలంటూ పెరుగుతున్న డిమాండ్లు!
- నేపాలీ కాంగ్రెస్‌లో పలువురు నేతల డిమాండ్లు
- తాజా ‘మహాసమితి’ సమావేశాల్లో హిందూ రాజ్యం తీర్మానానికి ఆమోదం
- ప్రజాడిమాండ్‌ను ఆమోదించకపోతే ఇబ్బందులు తప్పవని నేతల్లో అభిప్రాయం
నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలన్న డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. వైదిక్ సనాతన్ హిందూ దేశంగా నేపాల్‌ను ప్రకటించాలని అక్కడి పార్టీల నేతలు డిమాండ్లు చేస్తున్నారు. అతి పెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌లో కూడా ఈ డిమాండ్స్ వినిపిస్తుండటం గమనార్హం
నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన సుమారు 950 మంది జనరల్ కమిటీ సభ్యులు హిందూ రాజ్యాన్ని డిమాండ్ చేస్తూ పిటిషన్‌పై సంతకం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న 14వ మహాసమితి సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అతిపెద్ద సమావేశంగా భావించే మహాసమితిలో ఈ తీర్మానానికి ఆమోదం లభించడం గమనార్హం. ఈ సమావేశంలో దాదాపు 2200 మంది కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు శంకర్ బండారీ ఈ కాంపెయిన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ షేర్ బహదూర్ దేవుబా ముందు కూడా తమ డిమాండ్లను వినిపించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అధ్యక్షుడు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ప్రజాభిప్రాయాన్ని మన్నించకపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని ఆయనకు శంకర్ బండారీ చెప్పినట్టు తెలిసింది.
హిందూ రాజ్య డిమాండ్‌పై సీపీఎన్-యూఎమ్ఎల్, సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్)లు మౌనాన్నే ఆశ్రయించగా దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా ఈ డిమాండ్‌తో ఏకీభవించింది.
గతంలో హిందూ దేశంగా ఉన్న నేపాల్ 2008లో లౌకిక, ప్రజాస్వామిక దేశంగా మారిన విషయం తెలిసింది. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక తమది లౌకిక దేశమని అధికారికంగా ప్రకటించుకున్నారు. ఒకప్పుడు ఉద్యమబాటలో దశాబ్ద కాలం పాటు ప్రజాయుద్ధం చేసిన మావోలు 2006లో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ పోరాట బాటలో ఏకంగా 13 వేల మంది అసువులు బాసారు.