ఈటీవీ విన్ ట్రాక్ పైకి 'శీష్ మహల్' మూవీ!
- రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రగా 'శీష్ మహల్'
- తెలంగాణ నేపథ్యంలో నడిచే కథ
- 15 లక్షల బడ్జెట్ తో నిర్మించిన సినిమా
- సహజత్వానికి పెద్దపీట వేసిన డైరెక్టర్
ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ వారం 'శీష్ మహల్' సినిమా రానుంది. రేపటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా ఈటీవీ విన్ నుంచి వచ్చేసింది. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.
నాలుగు కథలతో కూడిన అంథాలజీ కాన్సెప్ట్ తో ఈ సినిమా నడుస్తుంది. సినిమా అంటే ఎంతో ఇష్టపడే కొంతమంది కుర్రాళ్లు, ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఒక సినిమా తీయడానికి నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు పడే ఆరాటం .. కష్టాలే ఈ సినిమాలోని ప్రధానమైన కథాంశం. సహజత్వానికి పెద్ద పీటవేస్తూ జీవితాలను ఆవిష్కరించే సినిమా ఇది.
2013లోనే పూర్తయిన సినిమా ఇది. 'అర్జున్ రెడ్డి'కి ముందు రాహుల్ రామకృష్ణ ఈ సినిమా చేశాడు. తెలంగాణ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. రాహుల్ రామకృష్ణ తెలంగాణ యాస ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. 15 లక్షల బడ్జెట్ తో .. ఎక్కువగా కొత్త ఆర్టిస్టులతో నిర్మించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.