బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేస్తున్న కోహ్లీ... ఇది నిజం కాదు... డీప్ ఫేక్ వీడియో!
- సోషల్ మీడియాలో కోహ్లీ వీడియో వైరల్
- దిగ్భ్రాంతికి గురవుతున్న నెటిజన్లు
- కోహ్లీ ముఖాన్ని, వాయిస్ ను కాపీ చేసిన సైబర్ నేరగాళ్లు
డీప్ ఫేక్ వీడియో బాధితుల జాబితాలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా చేరాడు. ఓ బెట్టింగ్ యాప్ కు కోహ్లీ ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
బాగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్ లాభదాయకం అని కోహ్లీ ప్రచారం చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియో చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోహ్లీ ఏంటి... ఓ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేయడం ఏంటని తీవ్రంగా చర్చ సాగుతోంది.
అయితే ఆ తర్వాత తేలింది ఏంటంటే... కోహ్లీ ఉన్న ఆ వీడియో డీఫ్ ఫేక్ అని వెల్లడైంది. కోహ్లీ ముఖాన్ని మాత్రమే కాదు, కోహ్లీ గొంతును కూడా అచ్చుగుద్దినట్టు కాపీ చేశారు. కోహ్లీది మాత్రమే కాదు, ఓ న్యూస్ యాంకర్ వీడియో కూడా ఇలాగే డీప్ ఫేక్ వీడియోతో మార్ఫింగ్ చేసి నెట్టింట వదిలారు.