పవన్ కల్యాణ్ వస్తే ఒక నమస్కారం.. రాకపోతే రెండు నమస్కారాలు: ముద్రగడ
- పవన్ కలుస్తారని ముద్రగడకు చెప్పిన జనసేన నేతలు
- నెల గడుస్తున్నా పవన్ రాక గురించి లేని క్లారిటీ
- మనం చేసేదేమీ లేదన్న ముద్రగడ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆయన వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, తాను వైసీపీలోకి వెళ్లడం లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయనను జనసేన నేతలు కలవడం, పార్టీలోకి ఆహ్వానించడం, జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుస్తారని చెప్పడం జరిగాయి. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నా... పవన్ ముద్రగడను ఎప్పుడు కలుస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు.
అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ రాజమండ్రిలో ఉన్న విషయాన్ని ముద్రగడ వద్ద ఆయన అనుచరులు ప్రస్తావించారట. దీంతో, పవన్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పవన్ వచ్చి కలిస్తే ఒక నమస్కారం... రాకపోతే రెండు నమస్కారాలు' అని అని అన్నారట. మనం చెప్పాల్సింది చెప్పాం... ఆ తర్వాత మనం చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారట.