నేను గైనకాలజిస్ట్ ని... బిడ్డను తల్లి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు: గవర్నర్ తమిళిసై

  • ఐఐటీ హైదరాబాద్ లో కార్యక్రమం
  • వర్చువల్ గా ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై 
  • తెలంగాణ, పుదుచ్చేరిలను కవల పిల్లలతో పోల్చిన వైనం
ఐఐటీ హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నేను తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పుడు ఎలా పనిచేస్తానో అని... అసలు పనిచేస్తానో లేదో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. నేను గైనకాలజిస్ట్ ని... బిడ్డను తల్లి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని స్పష్టం చేశారు. నాకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి బాధ్యతలు కూడా అప్పగించారు... కవల పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలో కూడా డాక్టర్ గా నాకు తెలుసు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. 

డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే.


More Telugu News