పవన్ కల్యాణే నన్ను ఏమీ చేయలేక పోయారు... నీవెంత?: లోకేశ్ పై గుడివాడ అమర్ నాథ్ ఫైర్
- భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని గుడివాడ సవాల్
- లోకేశ్ మాదిరి తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని వ్యాఖ్య
- రెడ్ బుక్ లో తొలి పేజీ ఓపెన్ చేసే అవకాశం కూడా లోకేశ్ కు రాదన్న గుడివాడ
టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సవాల్ విసిరారు. భూ ఆక్రమణలకు పాల్పడినట్టు కానీ, అవినీతి చేసినట్టు కానీ నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణే తనను ఏమీ పీకలేకపోయారని... నీవెంతని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 420 అయిన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ ను పక్కన పెట్టుకుని ఒక 420 మాదిరి లోకేశ్ మాట్లాడారని అన్నారు.
తాను పాలు తాగి పెరిగితే.. గోవింద్ సారా తాగి పెరిగాడని అన్నారు. సారా కాసుకుని పెరిగిన వాళ్లు తనను విమర్శిస్తారా? అని మండిపడ్డారు. లోకేశ్ మాదిరి తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని... కష్టపడి కింద స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చానని చెప్పారు. లోకేశ్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
లోకేశ్ వెంట స్మగ్లర్లు, వీరప్పన్ లు ఉన్నారని అమర్ నాథ్ విమర్శించారు. అయ్యన్న పాత్రుడు గంజాయి డాన్ అని గంటా శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారని అన్నారు. మీ తండ్రి చంద్రబాబు గురించి గతంలో దివంగత ఎన్టీఆర్, మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పవన్ కల్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. రెడ్ బుక్ లో తొలి పేజీని కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేశ్ కు రాదని ఎద్దేవా చేశారు. ఎర్ర బుక్ ను మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారనేది లోకేశ్ ఇష్టమని అన్నారు.