ఆసక్తిని రేకెత్తిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్
- వరుణ్ తేజ్ హీరోగా 'ఆపరేషన్ వాలెంటైన్'
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఆయన జోడీకడుతున్న మానుషి చిల్లర్
- మార్చి 1వ తేదీన సినిమా రిలీజ్
వైమానికదళ నేపథ్యంలో ఇంతవరకూ పూర్తి స్థాయి తెలుగు సినిమా వచ్చింది లేదు. అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాగా 'ఆపరేషన్ వాలెంటైన్' కనిపిస్తుంది. వరుణ్ తేజ్ - మానుషి చిల్లర జంటగా నటించిన ఈ సినిమాకి, శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. మార్చి 1వ తేదీన ఈ ఈ సినిమాను తెలుగు .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. వాటిలో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేయగా, హిందీ ట్రైలర్ ను సల్మాన్ విడుదల చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ ... ఎమోషన్ ప్రధానంగా నడిచే సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.
యుద్ధ విమానాలు .. అవి చేసే విన్యాసాలు ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 2019లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మీర్ సర్వర్ - రుహానీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.