మీది మొత్తం రూ.1000 అయింది.. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్వీట్

  • కుమారి ఆంటీ డైలాగ్ తో ట్రాఫిక్ పోలీసుల ట్వీట్
  • ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కోసం ఫన్నీ పోస్టులు
  • ఉల్లంఘనలకు జరిమానా తప్పదంటూ సందేశం
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన కుమారీ ఆంటీ డైలాగ్ ‘మీది థౌజండ్ రూపీస్ అయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా’.. ఈ ఒక్క డైలాగ్ తో కుమారీ ఆంటీ లైఫే మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందడం చూసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు.. తాజాగా దానిని కాపీ కొట్టారు. కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ ఉల్లంఘనులకు నవ్విస్తూనే చురకలు వేశారు.

ఓ ద్విచక్ర వాహనదారుడు డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ లో మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. ‘మీది మొత్తం రూ.థౌజండ్ అయింది. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా’ అంటూ ట్వీట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పై జనాలలో అవగాహన పెంచడానికి హైదరాబాద్ పోలీసులు వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఫన్నీ పోస్టులతో పరోక్షంగా ట్రాఫిక్ రూల్స్ ను గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


More Telugu News