16 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ధోనీ.. మరి అతడి శాలరీ ఎంతంటే..!
- సీఎస్‌కేతో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ధోనికి టీం శుభాకాంక్షలు
- ‘తలా’ వందనాలు అర్పించిన వైనం
- ఇన్నేళ్లల్లో సీజన్‌కు 1.5 మిలియన్ డాలర్ల నుంచి 12 కోట్లకు పారితోషికం
భారత క్రికెట్ చరిత్రలో ధోనీ ఓ లీడర్‌గా తనదైన గౌరవాభిమానాలను సొంతం చేసుకున్నాడు. టీంను ముందుండి నడిపించడంలో, యువక్రీడాకారులను ప్రోత్సహించడంలో తనదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాజాగా ధోనీ సీఎస్‌కే టీం సభ్యుడిగా 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్‌కే ధోనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. ‘తలా’కు తిరుగేలేదంటూ బ్రహ్మరథం పట్టింది.
అయితే, ఇన్నేళ్లుగా సీఎస్‌కే కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోని పారితోషికంలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 2008 ఆక్షన్‌లో తొలిసారి సీఎస్‌కే ధోనిని 1.5 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. 2010 వరకూ ధోనీ ఇదే పారితోషికాన్ని అందుకున్నాడు. కానీ, 2011-13 మధ్య అతడి పారితోషికం 1.8 మిలియన్ డాలర్లకు చేరింది. 2014-17 మద్య సీజన్‌కు రూ.12.5 కోట్ల చొప్పున ధోనీ తీసుకున్నాడు. ఇక 2018-21 మధ్య ఇది ఏకంగా సీజన్‌కు రూ.15 కోట్లకు చేరింది. అయితే, 2022 నుంచి సీఎస్‌కే ధోనీకి ఒక్కో సీజన్‌కు రూ.12 కోట్లు చెల్లిస్తోంది.