అందుకే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కృతజ్ఞత చూపనుంది: అద్దంకి దయాకర్
- లక్ష్మణ్ మాటలు వింటుంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉన్నట్లుగా అర్థమవుతోందని వ్యాఖ్య
- అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేలా అవగాహన ఉందని వ్యాఖ్య
- బీజేపీ బలంగా లేనిచోట ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకుంటున్నట్లు వ్యాఖ్య
బీఆర్ఎస్‌ను అవినీతి నుంచి కాపాడినందుకు బీజేపీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కృతజ్ఞత చూపుతారని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాటలు వింటుంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉన్నట్లుగా అర్థమవుతోందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేలా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బలంగా లేనిచోట ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సహకారం తీసుకుంటోందన్నారు. అవినీతి నుంచి బీజేపీ కాపాడినందుకు బీఆర్ఎస్ ఈ విధంగా కృతజ్ఞత చూపనుందన్నారు.