హెలికాప్టర్‌లో వెళ్లి మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవచ్చు... ధరలు ఎలా ఉన్నాయంటే..!

  • ఈ నెల 21 నుంచి 25 వరకు హెలికాప్టర్ సేవలు అందిస్తోన్న హెలి ట్యాక్సీ సంస్థ
  • హన్మకొండ-మేడారం-హన్మకొండ ధర ఒక్కరికి రూ.28,999
  • హైదరాబాద్-మేడారం-హైదరాబాద్ ధర ఒక్కరికి రూ.95,833
  • 'జాయ్' కింద ఏడు నిమిషాల పాటు ఆకాశంలోంచి జాతరను చూపిస్తే రూ.4,300 ఛార్జ్
సమ్మక్క సారక్క భక్తులకు శుభవార్త. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లతో పాటు పెద్ద ఎత్తున ప్రయివేటు వాహనాలు వెళుతున్నాయి. ట్రాఫిక్ రద్దీని వద్దనుకునే వారికి... ఎలాంటి ప్రయాస లేకుండా దర్శనం కావాలని కోరుకునే భక్తులకు హెలీ ట్యాక్సీ సంస్థ ప్రత్యేక హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేసింది. ఈ నెల 21 నుంచి 25 వరకు హెలికాప్టర్ సేవలు అందించనుంది. కేవలం అమ్మవార్ల దర్శనమే కాదు... ఏడు నిమిషాల పాటు ఆకాశం నుంచి జాతరను వీక్షించేందుకు వీలు కల్పిస్తోంది.

టిక్కెట్ ధరలు ఇలా...

హన్మకొండ-మేడారం-హన్మకొండ షటిల్ ధర - ఒక్కరికి రూ.28,999. భక్తులు హన్మకొండలో హెలికాప్టర్ ఎక్కి మేడారంలో దిగి... వీఐపీ దర్శనం చేసుకున్న తర్వాత అదే హెలికాప్టర్‌లో తిరిగి హన్మకొండకు చేరుకుంటారు. ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల లోపు మేడారం చేరుకుంటారు. అలాగే 'జాయ్' కింద మేడారంలో ఏడు నిమిషాల పాటు ఆకాశం లోంచి జాతరను చూపిస్తారు. దీనికి ఫీజు రూ.4,300 వసూలు చేస్తారు.

హైదరాబాద్-మేడారం-హైదరాబాద్ టిక్కెట్ ధర ఒక్కరికి రూ.95,833. ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన చాపర్ బేగంపేట విమానాశ్రయం నుంచి నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం 74834 32752, 94003 99999 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.


More Telugu News