బాధిత విలేకరికి నా సానుభూతి: బాలకృష్ణ
- నిన్న రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ
- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడి
- జర్నలిస్టుపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నట్టు బాలకృష్ణ ప్రకటన
- మరోసారి ఇలా చేయొద్దంటూ వార్నింగ్
రాప్తాడులో నిన్న సీఎం జగన్ హాజరైన 'సిద్ధం' సభలో ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టుపై విచక్షణ రహితంగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.
విధి నిర్వహణలో భాగంగా సభను కవర్ చేసేందుకు వచ్చిన పాత్రికేయుడిపై వైసీపీ నేతల దాడి దారుణమైన చర్య అని, దీన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. బాధిత విలేకరికి సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలనుకోవడం ఏంటి? ఏపీలో పాత్రికేయులకు రక్షణ లేకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, మీడియా ప్రతినిధుల రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రాప్తాడు ఘటనను ఎవరూ హర్షించరని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.