ఓటీటీ దిశగా మోహన్ లాల్ మూవీ .. 'మలై కోటై వాలిబన్'
- మలయాళ మూవీగా 'మలై కోటై వాలిబన్'
- జనవరి 26వ తేదీన విడుదలైన సినిమా
- ఆంగ్లేయుల కాలంలో జరిగే పోరాట నేపథ్యం
- మార్చి 1 నుంచి హాట్ స్టార్ వేదికపైకి
మోహన్ లాల్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇప్పటికీ ఆయన కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రయోగాలు చేస్తూనే వెళుతున్నారు. ఆయన తాజా చిత్రంగా 'మలైకోట వాలిబన్' రూపొందింది. లిజో జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జనవరి 26వ తేదీన థియేటర్లకు వచ్చింది.
అయితే 65 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఆ మార్కును ఇంతవరకూ అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతూనే ఉంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతూనే ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ఈ సినిమాను 'హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
బ్రిటీష్ పాలకుల నియంతృత్వ ధోరణి పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ, కేరళలోని ఒక ప్రాంతం వారు చేసే పోరాటమే ఈ కథ. ఈ సినిమాలో 'వాలిబన్' పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి .. హరీశ్ పేరడీ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.