శోభన్ బాబుగారితో చేసింది ఒక సినిమానే .. అప్పుడు ఆయన ఒక మాటన్నారు: శుభలేఖ సుధాకర్
- 42 ఏళ్ల కెరియర్ని చూశానన్న సుధాకర్
- నటుడిగా సక్సెస్ అయ్యానని సంతృప్తి
- కొత్తగా ఎవరు కలిసినా 'సొంత ఇల్లు ఉందా' అని శోభన్ బాబు అడుగుతారని వెల్లడి
శుభలేఖ సుధాకర్ .. సీనియర్ కేరక్టర్ ఆర్టిస్టు. ఆయన పేరు చెప్పుకోగానే కళ్లముందు కదలాడే కొన్ని పాత్రలు ఉన్నాయి. అలాంటి ఆయన తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను. సినిమా గురించి తెలిసిన తరువాత నేను అభిమానించింది అమితాబ్ గారిని" అని అన్నారు.
"అప్పట్లో నా పర్సనాలిటీ చాలా వీక్ .. ఓ 10 .. 15 సినిమాలు చేస్తే చాలని అనుకున్నాను. కానీ నటుడిగా 42 ఏళ్ల కెరియర్ ను చూశాను. అందువలన నాకు ఇష్టమైన రంగంలో నేను సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. శోభన్ బాబుగారితో నేను ఒకే ఒక సినిమా చేశాను. ఆయన చాలా నైస్ పర్సన్ అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ మాత్రం సమయం సరిపోతుంది" అని చెప్పారు.
"శోభన్ బాబుగారిని కొత్తగా ఎవరు కలిసినా, ముందుగా 'సొంత ఇల్లు ఉందా' అని ఆయన అడుగుతారు. నాలుగు గోడలు .. పై కప్పూ ఉంటే లోపల గంజి తాగినా .. మంచినీళ్లు మాత్రమే తాగి పడుకున్నా ఎవరికీ తెలియదు. అద్దె కట్టలేని పరిస్థితి వస్తే, సామాన్లతో పాటు జీవితమే రోడ్డుపైకి వచ్చి పడుతుంది. అందువలన జాగ్రత్తగా ఉండాలి" అని అనేవారు" అంటూ ఆ రోజుని గుర్తుచేసుకున్నారు.